భాను కిరణ్ విజయవాడ లింక్స్‌పై ఆరా: హైదరాబాద్ సిపి ఎకె ఖాన్

సూరి హత్య కేసు దర్యాప్తునకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మద్దెలచెర్వు సూరి ప్రత్యర్థుల ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. సూరి హత్యలో ప్రముఖల పాత్రపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, విజయవాడపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన అన్నారు. భాను కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నట్లు, త్వరలోనే నిగ్గు తేలనున్నట్లు ఆయన తెలిపారు. భాను కిరణ్ దొరికే వరకు మధుమోహన్‌తో పాటు అందరూ అనుమానితులేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications