నివేదిక అధ్యయనం చేసి నిర్ణయం చెప్పండి: అఖిలపక్షంలో చిదంబరం

రాష్ట్రంలోని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాన్ని మనం కనుగొనాలని ఆయన చెప్పారు. కొన్ని పార్టీలు అఖిలపక్షానికి హాజరు కానందుకు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయితే హాజరు కాని బిజెపి, టిఆర్ఎస్, టిడిపి పార్టీలకు నివేదికను పంపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రత పరిరక్షణకు అందరూ కృషి చేయాలని సూచించారు. అందరం కలిసి సామరస్యంగా, ఆమోదయోగ్య పరిష్కారం కనుగొందామని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ సంవత్సరంపాటు అధ్యయనం చేసి మంచి నివేదికను ఇచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications