నార్త్ బ్లాక్ కు చేరుకున్న అఖిలపక్షం: కాసేపట్లో చిదంబరంతో భేటీ

భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలు చిదంబరం ఆహ్వానాన్ని తిరస్కరించారు. పార్టీకి ఇద్దరిని పిలవడం సరికాదంటూ వారు అఖిలపక్షాన్ని బహిష్కరించారు. అయితే రాని వారికి స్పీడు పోస్టులో నివేదిక పంపిస్తామని చిదంబరం ప్రకటించారు. అఖిలపక్షానికి కాంగ్రెస్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కావూరి సాంబశివరావు, ప్రజారాజ్యం నుండి సి. రామచంద్రయ్య, ఎంఐఎం నుండి అక్బరుద్దీన్, పాషా ఖాద్రీ, సిపిఎం నుండి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, సిపిఐ నుండి గుండా మల్లేషం, నారాయణ వెళ్లారు.












Click it and Unblock the Notifications