యథాతథ స్థితి సాధ్యం కాదు, కేంద్రం జోక్యం తప్పనిసరి: శ్రీకృష్ణ

మిగతా మూడు ప్రత్యామ్నాయాలు, అంటే 4,5, 6 ప్రత్యమ్నాయాలు ఆచరణ సాధ్యమైనవిగా కమిటీ చెప్పింది. 4. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజన, రెండు రాష్ట్రాలకు కొత్త రాజధానులు, కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్, కేంద్ర పాలిత ప్రాంతంలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోని 1330 గ్రామాలు. 5. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలుగా విభజన. సరిహద్దులు సర్దుబాటు చేసి హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా చేయడం, సీమాంధ్రకు కొత్త రాజధాని. 6. సమైక్యాంధ్రను కొనసాగించడం, వైద్య, విద్య, సాధారణ అభివృద్ధికి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు తెలంగాణ ప్రయోజనాలకు ప్రత్యేక రాజ్యాంగ రక్షణ కల్పించడం. వీటిలో ఐదో ప్రత్యామ్నాయానికి తెలంగాణవాదులు అంగీకరించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications