తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీ వెంకటేశ్వర స్వామి బంగారు రథం గొడుగు చోరీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వారి బంగారు రథంపైనున్న గొడుగు చోరీకి గురైంది. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. సుమారు రూ.కోటి విలువగా అంచనా వేస్తున్న గొడుగు చోరీ జరగడంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సెక్టార్‌-1 ఏవీఎస్‌వో విశ్వనాథం చర్యలు తీసుకున్నారు. విశేష పర్వదినాల్లో బంగారు రథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో వైభవంగా వూరేగుతారు. ఈ రథాన్ని శ్రీవారి ఆలయ ముందున్న వాహనమండపం వెనుక భాగంలో ఇనుప రేకులతో నిర్మించిన మండపంలో భద్రపరిచారు. ఈ మండపం పక్కనే పెద్దజీయర్‌ మఠం నిర్మాణం జరుగుతోంది.

పటిష్ఠంగా ఉన్న రేకులను మండపం దక్షిణ వైపున ఓ రేకును కత్తిరించి ఆగంతుకులు లోనికి ప్రవేశించారు. వాహనంపైనున్న గొడుగును అపహరించారు. మండపానికి రంధ్రం ఉన్న విషయాన్ని మఠం నిర్మాణ పనులు చేస్తున్న కొందరు భవన నిర్మాణ కార్మికులు గుర్తించి నిఘా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న దేవస్థానం జేఈవో కె.భాస్కర్‌ తదితరులు రథ మండపాన్ని పరిశీలించారు. చోరీ సంఘటనను తెలుసుకుని నిఘా వైఫల్యంపై జేఈవో అసహనం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X