హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియాలో కేంద్ర బలగాలు అవాస్తవం: డిజిపి అరవిందరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

DGP Aravind Rao
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయలంలో కేంద్ర బలగాలు లేవని అన్నారు. ఉస్మానియా గేట్ల వద్ద మాత్రమే పోలీసులను మోహరించామని రాష్ట్ర డిజిపి అరవింద రావు ఆదివారం చెప్పారు. అదీ కూడా ఎలాంటి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రాష్ట్ర పోలీసులను మోహరించినట్టు చెప్పారు.

అయితే ఉస్మానియాలో కేంద్ర బలగాలు ఉన్నట్టు కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన చెప్పారు. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. అది అవాస్తవమని చెప్పారు. విశ్వవిద్యాలయ పరిధిలోకి మీడియా ఆంక్షల తొలగింపుపై హోంమంత్రి సబితారెడ్డితో మాట్లాడామని చెప్పారు. మరోసారి సాయంత్రం మీడియా ప్రతినిధులతో నగర కమిషనర్ ఆదివారం మాట్లాడుతారని చెప్పారు.

ఉస్మానియాలో విద్యార్థులతో పాటు బయటి వ్యక్తులు కూడా ఉన్నారని పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ ఆరోపించారు. తమకు వేరే వ్యక్తులు ఉన్నట్టు స్పష్టమైన సమాచారం పచ్చిందన్నారు. బయటి వ్యక్తుల వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. ఇప్పటికే 21 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. పోలీసులు వాహనాలు దగ్ధం చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. బయటి వ్యక్తులే వాహనాలపై దాడులు చేస్తున్నారన్నారు. కాగా విద్యార్థులకు సెలవులు ఎప్పటిలాగే ఇచ్చామని ఓయు విసి తిరుమలరావు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X