కొడుకు జగన్ ఆస్తులపైనే వైయస్సార్ యావ: టిడిపి నేత బైరెడ్డి

కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదించడానికి పనికి మాలిన, చేతకాని న్యాయవాదులను వైయస్ పంపారని, తన అనుచరులు కాబట్టే వారిని పంపారని ఆయన ఆరోపించారు. ఆ ముగ్గురు న్యాయవాదుల జాబితాను ఆయన మీడియాకు అందజేశారు. వైయస్సార్ రాష్ట్ర హక్కులను కాలరాశారని ఆయన అన్నారు. వైయస్సార్ రాష్ట్రానికి చిప్ప చేతికిచ్చారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు గతంలో వైయస్సార్‌కు రాసిన లేఖను కూడా ఆయన మీడియాకు అందించారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై వైయస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications