హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై వామపక్షాల నేతలు నారాయణ, రాఘవులు డిమాండ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Narayana-BV Raghavulu
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ అంశాన్ని నాన్చకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వామపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమవుతామని సిపిఐ ప్రకటించగా, తొందరగా తేల్చాలని సిపిఎం అంటోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సీపీఐ ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమవుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. తెలంగాణ రాజకీయ ఐకాసతో కలవకుండా తమ పార్టీయే సొంతంగా ఉద్యమం చేస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని... దీనిపై పార్టీలో విభేదాలు వస్తున్నాయన్న వదంతులను కొట్టిపారేశారు. కృష్ణ ట్రైబ్యునల్‌ తీర్పు వల్ల నష్టపోతున్న 12 జిల్లాల్లో ప్రత్యక్ష ఆందోళనలు చేయనున్నట్లు నారాయణ స్పష్టం చేశారు.

కేంద్రం రాష్ట్రవిభజనపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులున్నట్లు తాము భావించట్లేదని చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ సూచించినట్లు వస్తున్న వదంతులు నిజమైతే అది కేంద్రాన్ని తప్పుదోవ పట్టించడమేనన్నారు. రాష్ట్రం ప్రశాంతంగానే ఉన్నప్పటికీ కొందరు అనవసరంగా తప్పుడు వదంతులు సృష్టిస్తున్నారని ఆక్షేపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X