ప్రభుత్వం తుమ్మితే ఉడే ముక్కు: జగన్ వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ

జగన్ రైతుల కోసం ఉద్యమిస్తున్న తరుణంలో చంద్రబాబు రైతుల గళం ఎత్తుతున్నారన్నారు. రైతులు చంద్రబాబు డ్రామాలు నమ్మరన్నారు. జగన్ కృష్ణా జిల్లాలో రైతు దీక్ష చేసినప్పుడు నిరాహార దీక్ష చేపట్టిన చంద్రబాబు, ఇప్పుడు జగన్ జలదీక్షకు చేపట్టిగా మూడు జిల్లాల పర్యటన ప్రారంభించారన్నారు. కృష్ణా నీటిలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే వైయస్ బతికి ఉంటే ఊరుకునే వారు కాదన్నారు. రైతుల చావులకు పంట నష్టానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంటుంటే, చంద్రబాబు డబ్బుల కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆనాడు అన్నారన్నారు.
రైతులకు సరియైన న్యాయం జరిగింది వైయస్ హయాంలోనే అని అన్నారు.తుమ్మితే ఊడిపోయే ముక్కుకు మన ముక్కును పోగొట్టుకుంటే పోయేదేమి లేదన్నారు. జగన్ ఎక్కడ దీక్ష చేసిన రాజకీయం కోణంలో చూస్తున్నారన్నారు. జగన్ రైతుల శ్రేయస్సుకే దీక్షను చేస్తున్నారు. కానీ ఇందులో రాజకీయ కోణం లేదన్నారు. రైతుల సమస్యలను ఢిల్లీలో వినిపించడానికే ఆయన ఢిల్లీ దీక్ష చేపట్టారన్నారు. కృష్ణా నీటిలో మనకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి గురించి ప్రశ్నించగా ఆయన గురించి మాట్లాడుకోకపోవటమే మంచిదని చెప్పారు.












Click it and Unblock the Notifications