వైయస్ జగన్ పార్టీ పేరు రాజన్న రాజ్యం, ఆంగ్ల ప్రకటన వెల్లడి

పార్టీ కార్యాలయంగా తన ఇంటి అడ్రస్ (హౌస్ నెంబర్ 8-2-293/82/జె/ఏ/118, జర్నలిస్టు కాలనీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -33, ఆంధ్రప్రదేశ్)నే అందులో ఆయన పేర్కొన్నారు. ఈ చిరునామాతోనే ఆయన దరఖాస్తు చేశారు కూడా. ఇక, పార్టీ అధ్యక్షుడిగా వైవీ సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎస్.రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డి.శివశంకర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా టి.విశ్వనాథ రెడ్డి, కోశాధికారిగా కె.శ్రీనివాస్ నాయుడులను పేర్కొన్నారు. ఈ కార్యవర్గంతో ఈనెల పదో తేదీన పార్టీ పేరును రిజిస్టర్ చేయించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఆయన దరఖాస్తు చేశారు. అయితే, జగన్ అధ్యక్షుడిగా కాకుండా ఆయన సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డి పేరుతో ఈ దరఖాస్తు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications