కావూరి ఇన్ పురంధేశ్వరి ఔట్?: కేబినెట్ విస్తరణ మూహూర్తం

రాష్ట్రానికి ఇప్పుడు ఉన్న వాటికంటే ఒక మంత్రిపదవిని, మరో రెండు సహాయ మంత్రి పదవులను ఎక్కువగా ఇవ్వాలనే యోజనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన జైపాల్‌రెడ్డి ఒక్కరే పట్టణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్నారు. పురంధేశ్వరి, పనబాక లక్ష్మి, సాయిప్రతాప్, పల్లంరాజులు సహాయమంత్రులుగా ఉన్నారు. వీటికి తోడుగా మరో మూడు మంత్రి పదవులు (1+2) ఇచ్చే ఉద్దేశ్యంలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రి, సహాయ మంత్రి పదవులు సుమారు 70కి పైగా ఉంటాయి. రాష్ట్రంనుండి 32మంది ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రం రాష్ట్రానికి సరియైన ప్రధాన్యం ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం, జగన్ సమస్యల నేపథ్యంలో ఈమారు ఎపికి ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది.
సీమాంధ్రనుండి కావూరి సాంబశివరావు, కిషోర్ చంద్రదేవ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇక తెలంగాణ నుండి వి హనుమంతరావు, కేశవరావు, మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్‌లు ఉండగా అంజన్‌కుమార్ యాదవ్, సర్వే సత్యనారాయణ, మధుయాష్కీలు లాబీయింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంతమంది రేసులో ఉండటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అందుకే ఇప్పటి వరకు ఉన్న మంత్రులను కొందరిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో సమీకరణాలు మారే అవకాశం ఉంది. కేంద్ర మానవ వనరుల సహాయమంత్రి పురంధేశ్వరిని కేబినెట్ నుండి బయటకు పంపించే యత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
అయితే పురంధేశ్వరి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్టీఆర్ కూతురు కాబట్టి ఆమెను, ఆమె అభిమానులను సంతృప్తిపర్చడానికి రాష్ట్రంలో ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చే దిశలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ సమస్యను పరిష్కరించడం కోసం రెండు సహాయ మంత్రి పదవులను ఇక్కడి వారికి ఇచ్చే ఉద్దేశ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. బిసీ, బడుగులకు అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణవాదులపైకి వారిని ఎక్కుపెట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సీమాంధ్రలో జగన్‌ను ఎదుర్కొనే గట్టి వ్యక్తి లేకపోవడం అధిష్టానాన్ని ఆలోచింపజేస్తుంది. ఇటు అధిష్టానానికి అటు వైఎస్ కుటుంబానికి సన్నిహుతుడు అయిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జగన్‌ను ఎదుర్కొనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రెండుమూడు రోజుల్లో కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించాలనే యోచనలో ఉంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల్లో టెన్షన్ పెరుగుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications