కావూరి సాంబశివ రావుతో విభేదిస్తున్న కనుమూరి బాపిరాజు

కాగా, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు సర్దిచెప్పేందుకు కాంగ్రెసు అధిష్టానం మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. ఈసారి పూర్తి స్థాయి విస్తరణ జరగలేదని, అందుకే ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఎవరినీ తీసుకోలేదని, త్వరలో పూర్తి స్థాయి విస్తరణ ఉంటుందని అప్పుడు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని చెబుతున్నారు. అయితే, రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనాలు చేకూర్చడం లేదని తాము తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నామని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అంటున్నారు. పార్టీ అధిష్టానం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారంటున్నారు. ఈ పరిస్థితి వస్తుందని తాను ముందే చెప్పానని సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అంటున్నారు.












Click it and Unblock the Notifications