అలిగిన కావూరి సాంబశివ రావు: ప్రణబ్ ముఖర్జీతో భేటీకి డుమ్మా

శ్రీకృష్ణ కమిటీ నివేదికపై గురువారం సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో జరిగే సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల సమావేశానికి తాను రాబోనని కావూరి సాంబశివరావు మొండికేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం ఏర్పాటు చేసే అఖిల పక్ష సమావేశానికి కూడా తాను వెళ్లబోనని చెబుతున్నారు. మొత్తంగా కాంగ్రెసు పార్టీకి, ప్రభుత్వానికి సహాయ నిరాకరణ ద్వారా నిరసన తెలపాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఐదు సార్లు లోకసభకు ఎంపికైన తనకు మంత్రి పదవి ఇవ్వకుండా కొత్తగా వచ్చినవారికి మంత్రి పదవులు ఇస్తున్నారని కావూరి విమర్శిస్తున్నట్లు సమాచారం. ఇలాగైతే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ మనుగడ కష్టమని ఆయన అంటున్నారు. కాగా, గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications