సమైక్యాంధ్రకే ఓటు: ప్రణబ్ తో భేటీపై కావూరి ఇంట్లో ఎంపీల చర్చ!

ప్రణబ్‌తో భేటీలో అందరు ఎంపీలు సమైక్యాంధ్రవైపే మొగ్గు చూపే అస్కారం ఉంది. కాగా తెలంగాణ పార్లమెంటు సభ్యులతో ప్రణబ్ ముఖర్జీ ఇప్పటికే రెండుసార్లు భేటీ అయ్యారు. పలుమార్లు తెలంగాణ ఎంపీలతో భేటీ కావడం అనసర వివాదానికి దారి తీస్తున్న నేపథ్యంలో 20వ తారీఖున సీమాంధ్ర ఎంపీలు ప్రణబ్ ముఖర్జీ భేటీకి హాజరు కావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సీమాంధ్ర ఎంపీలు శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 6వ అంశం, నివేదిక ప్రథమ పరిష్కారంగా పేర్కొన్న సమైక్యాంధ్రకే కట్టుబడి ఉండటానికి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications