తెలంగాణపై చర్చకు ఢిల్లీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

సిఎం ఢిల్లీ పర్యటన తెలంగాణ అంశంపై అంతిమ నిర్ణయానికే అని సమాచారం. ఇప్పటికే తెలంగాణ ఎంపీలతో కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ రెండుసార్లు భేటీ అయ్యారు. గురువారం సీమాంధ్ర ఎంపీలతో కూడా భేటీ అయ్యారు. రెండు ప్రాంతాల వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆఖరుగా ముఖ్యమంత్రితో రాష్ట్ర పరిస్థితిపై చర్చించిన తర్వాత తెలంగాణ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు ప్రజారాజ్యం పార్టీతో సత్సంబంధాలు నెరపుతున్న విషయంపై కూడా అధిష్టానానికి ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది. జగన్ ఎఫెక్టును ఎలాగైనా ఎదుర్కొవచ్చునని, తెలంగాణపైనే ఒక నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications