వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ నుంచి వెళ్లిపోయినవారు గెలిచాక చూద్దాం: వైయస్ జగన్‌పై కిరణ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయినవారు గెలిచిన తర్వాత చూద్దామని ఆయన అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోదలుచుకున్నవాళ్లు రాజీనామాలు చేసి మళ్లీ గెలవాలని ఆయన సూచించారు. వైయస్ జగన్‌ వెంట శాసనసభ్యులు వెళ్తున్న విషయంపై ఆయన ఆ విధంగా అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం, తమ కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుంటాయని, సరైన సమయంలో ఆ నిర్ణయం వెలువడుతుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్ర విభజన అంశం చాలా జఠిలమైందని, అందుకే సమయం తీసుకుంటున్నారని ఆయన అన్నారు. 2014 వరకు తాము అధికారంలో ఉంటామని, 2014 ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరడానికి తాను ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, చిదంబరం, వీరప్ప మొయిలీ, మమతా బెనర్జీలను కలిసినట్లు ఆయన తెలిపారు. ఈసారి రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్ద పీట వేస్తారని నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. తమ విజ్ఞప్తికి మమతా బెనర్జీ సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి 19 కొత్త రైళ్లు ఇవ్వాలని, ఇతర ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాలని తాను మమతా బెనర్జీని కోరినట్లు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తాను ప్రధానిని కోరానని ఆయన చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కూడా మమతను కోరినట్లు ఆయన చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుపై పూర్తి స్థాయి నివేదికను పంపాల్సి ఉందని ఆయన చెప్పారు. ఉపాధ్యాయుల ఏకీకృత నిబంధనల సమస్యను పరిష్కారించాలని తాను ప్రధానిని కోరినట్లు ఆయన తెలిపారు.

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక కింద ఇప్పటికే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలున్నాయని, ఈ ప్రణాళిక కిందికి వరంగల్, కరీంనగర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలని తేవాలని కోరానని ఆయన చెప్పారు. వరద, తుఫాను తాకిడి ప్రాంతాల్లో సహాయానికి ప్రత్యేక ప్యాకేజీ అందించాలని కోరినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X