డోలపేటలో రచ్చబండను ప్రారంభించిన కిరణ్‌ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy
శ్రీకాకుళం: ప్రతిష్టాత్మాక ప్రభుత్వ రచ్చబండ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం డోలపేటలో సోమవారం ప్రారంభించారు. పేదలకు అండగా ఉండటానికి ప్రజలముందుకు పాలన తీసుకు రావడానికే రచ్చబండ కార్యక్రమం అని అన్నారు. రేషన్ కార్డులు పొందని వారికి రచ్చబండలో అందిస్తామని చెప్పారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి అధికారులు పథకాన్ని సమీక్షిస్తారని చెప్పారు. పింఛన్లు, అభయహస్తం, రేషన్ కార్డులు తదితర విషయాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

అర్హులైనప్పటికీ పింఛన్లు రానివారు, రేషన్ కార్డులు లేనివారు అర్జీ ఇస్తే పింఛన్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఇళ్లు లేని వారిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారు ఇండ్ల దరఖాస్తుకు అప్లయి చేసుకుంటు వస్తుందని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. కాగా రచ్చబండ కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి కిరణ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోకు దండ వేసి నివాళులు అర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+