హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి కిరణ్‌పై జగన్ వర్గం గోనె ప్రకాష్ రావు ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కిరణ్ వ్యాఖ్యలపై గోనె ప్రకాష్ రావు మంగళవారం విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌పై, వైయస్‌పై ముఖ్యమంత్రి అసత్య ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వైయస్‌ను తానే పివికి పరిచయం చేశానని చెప్పడం హస్యాస్పదం అన్నారు. ఇండియా టుడే వార పత్రికలో భారతదేశంలో అతిశక్తివంతమైన రాజకీయ నేతల్లో 1992లోనే వచ్చిందన్న విషయం ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డికి వారసుడు నేనే అంటున్న ముఖ్యమంత్రికి ఆ అర్హత లేదన్నారు. వైయస్ మరణించిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వారసుడిని మీరే నిర్ణయించి ఇప్పుడు మేం వైయస్ వారసులం అనడం ఎంతవరకు సమంజసమన్నారు. పరిటాల రవి హత్య తర్వాత చంద్రబాబు వెంకటాపురం వెళితే ఆ గ్రామ ప్రజలు చంద్రబాబును అడ్డుకున్నారన్నారు. పరిటాల హత్యకు కారకుడు చంద్రబాబు అని ఆరోపించిన విషయం గుర్తు చేశారు. పరిటాల రవిది రాజకీయ హత్య కాదని, అవి కుటుంబ గొడవల జరిగిన హత్య అన్నారు.

పరిటాల రవి విపక్ష టిడిపిలో ఉన్నప్పటికీ చంపించాలని వైయస్ ఏనాడూ అనుకోలేదని అన్నారు. కానీ ఆయన తీరును మార్చుకోవాలని మాత్రం సూచించారని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సోమవారం జగన్‌ను హత్య కేసులో తప్పించాననే వ్యాఖ్యలు చేశారన్నారు. పివి దగ్గరకు వైయస్‌ను తాను తీసుకు వెళ్లానని చెబుతున్న సిఎం మాటల్లో నిజం లేదన్నారు. సిఎంకు ఖలేజా ఉంటే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. సిఎం మాటలన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే అని ఆరోపించారు. సిఎం కిరణ్ తెలుగు స్పష్టంగా నేర్చుకోవాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X