ప్రశాంత పరిస్థితికి సహకరించండి, అప్పుడే పెట్టుబడులు వస్తాయి: గవర్నర్

Narasimhan
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కోసం అందరూ సహకరించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. రాష్ట్రాభివృద్దికి పెట్టుబడులు అవసరమని, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని ఆయన అన్నారు. ఎందరో మహనీయుల త్యాగం ఫలితంగానే మనం ఈ రోజు గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని ఆయన బుధవారం అన్నారు. ఆయన సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సైనిక వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. గత ఏడాది రైతులు శ్రమించి పంటను పండించారని అయితే అనుకోని వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందన్నారు. ఇది రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వమన్నారు. రైతులలోనూ ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపేందుకు కృషి చేసిందన్నారు.

రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడానికి, మరింత ముందుకు వెళ్లడానికి అందరి సహకారం అవసమరన్నారు. దక్షిణ భారత దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ వంటిదన్నారు. రైతు సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ప్రభుత్వం వివిధ పథకాలతో అన్ని వర్గాలకు చేరువయిందన్నారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. దెబ్బతిన్న ధాన్నాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. విశాఖ-కాకినాడల మధ్య పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 12 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. మరో 82 నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు.

కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ ఉపసభాపతి నాదెండ్ల మనోహర్‌, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జింఖానా మైదానంలోని సైనిక స్మారకస్తూపం వద్ద నివాళులర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+