హైడ్రా క్రేజ్.. సరూర్ నగర్ స్టేడియం వద్ద టెన్షన్.. ఎందుకంటే!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం చదువులను పూర్తిచేసుకుని ఉద్యోగాల వేటలో పడుతున్న నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఎంత నిరుద్యోగం ఉందో, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో హైడ్రాలో ఉద్యోగాల కోసం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్దకు వచ్చిన నిరుద్యోగులను చూస్తే అర్థమవుతుంది.

హైడ్రాలో కాంట్రాక్ట్ పద్దతిలో 150 ఉద్యోగాలు.. పోటెత్తిన నిరుద్యోగులు

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 150ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఆగస్టు 8, 9తేదీలలో నేరుగా ఫిజికల్ టెస్టులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 drf అసిస్టెంట్, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే 150 ఉద్యోగాల కోసం ఊహించని విధంగా యువత సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వద్ద పోటెత్తారు.

HYDRAA jobs Huge number of unemployed youth throng Sarurnagar Indoor Stadium in Hyderabad for HYDRAA jobs

పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలకు డిమాండ్

ఈరోజు ఉదయం నుంచి అభ్యర్థులు స్టేడియం వద్దకు చేరుకోవడంతో ఆ పరిసరాలలో రద్దీ నెలకొంది. సమయం గడుస్తున్నకొద్దీ ఉద్యోగార్దుల సంఖ్య పెరగడంతో వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. ఉద్యోగార్థులు పెద్దసంఖ్యలో క్యూలైన్లో నిలబడి దరఖాస్తు ప్రక్రియ కోసం వేచి చూస్తున్నారు. అయితే అక్కడికి వచ్చిన భారీ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని కొందరు ఈ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏర్పాట్ల పైనా అభ్యర్థుల అసహనం

ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, అందరికీ ఆమోదయోగ్యమైన సమర్థవంతమైన విధానాన్ని అనుసరించాలని వారు కోరుతున్నారు. ఇక్కడికి వచ్చిన అభ్యర్థులు ఏర్పాట్ల పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారీ సంఖ్యలో నిరుద్యోగులు రావడంతో అక్కడ తోపులాట జరుగుతుంది. దీంతో పోలీసులు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తమయ్యారు.

తెలంగాణాలో స్మార్ట్ రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు!
తెలంగాణాలో స్మార్ట్ రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు!

స్టేడియం వద్ద భారీగా భద్రత

స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాట్లను చేశారు. ఇంకా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్న క్రమంలో పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రద్దీ నియంత్రణకు అదనపు బలగాలను మోహరించారు. హైడ్రా లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పైన యువతలో ఆసక్తి అధికంగా ఉండడం ఈ రద్దీకి ప్రధాన కారణంగా అధికార వర్గాలు ఉన్నాయి. అయితే అభ్యర్థుల సౌకర్యం కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రస్తుతం చర్య తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+