బ్లాక్‌మనీ పెద్దల గురించి చెప్పండి: కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా నల్లధనం 462 బిలియన్ డాలర్ల మేరకు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించిన నేపథ్యంలో బ్లాక్‌మనీపై అత్యున్నత న్యాయస్థానం గురువారం కేంద్రాన్ని ప్రశ్నించింది. బ్లాక్‌మనీ కలిగివారి పేర్లను బహిర్గతం చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విదేశాల్లో, ముఖ్యంగా స్విస్ బ్యాంకుల్లో నల్లధనం కూడబెట్టుకున్న భారతీయుల వివరాలను వెల్లడించడంలో జాప్యంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. నల్లధనం పేరుతో పన్ను ఎగేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా, నల్లధనంపై కేంద్ర హోం మంత్రి, రిజర్వ్ బ్యాంకులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంకా ఫిబ్రవరి 3వ తేదీకి నల్లధనంపై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

జాతి సంపదను కొల్లగొట్టి విదేశీ బ్యాంకుల్లో నిల్వ చేసుకున్న నల్లధనం అక్రమార్కులకు కేంద్రంలోని యూపీఏ సర్కారు కొమ్ము కాస్తోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అగ్రనేత ఎల్‌కె అద్వానీ ఆరోపించారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం రూపంలో మగ్గుతున్న జాతి సంపదను తిరిగి వెనక్కి తెప్పించే అంశంలో ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. నల్లధనం వెలికి తీసే విషయంలో ప్రభుత్వం వద్ద దాచేందుకు ఏమీ లేకపోవచ్చు కానీ అదేసమయంలో తన వద్ద ఈ అంశంపై ఉన్న సమాచారాన్ని సైతం వెల్లడించేందుకు వెనుకంజ వేస్తోందన్నారు. రెండు మూడేళ్ల క్రితం తానీ అంశాన్ని ప్రస్తావించిన తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్ని పార్టీలూ దీనికి నల్లధన సమాచారం వెల్లడించేందుకు అన్ని పార్టీలు సమ్మతం తెలిపాయని ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+