సినీ నిర్మాతలు కళ్యాణ్, శింగనమల రమేష్‌లపై మరో ఫిర్యాదు

సినిమా హక్కులు ఇవ్వలేదు, డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో అష్వాఖ్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు కోసం వీరిద్దరిపై అష్వాఖ్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో నిరుడు ఆగస్టులో జూబ్లీహిల్స్‌లోని సి.కళ్యాణ్ కార్యాలయం బాలాజీ ల్యాబ్‌కు పిలిపించి బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు. మరోపక్క సూరి కేసు దర్యాప్తులో భాగంగా సీసీఎస్ అధికారులు గురువారం 'స్కిన్‌టచ్" సంస్థ యజమానిని ప్రశ్నించినట్లు సమాచారం.
కాగా, శింగనమల రమేష్ హైదరాబాదులోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణం కోసం 7.65 కోట్ల రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడనే ఆరోపణలపై సిసిఎస్‌లో రమేష్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో రమేష్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications