వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటి నుంచి భారత మార్కెట్లో ఆపిల్ ఐప్యాడ్ విక్రయాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Apple iPad
ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీకి పెట్టింది పేరు ఆపిల్. ఆపిల్ ప్రియులకు ఇది నిజంగానే శుభవార్త. ఆపిల్ సంస్థ ఇటీవల అమెరికాలో ప్రవేశపెట్టిన "ఆపిల్ ఐప్యాడ్" (టాబ్లెట్ పీసీ) భారత్‌కు రానే వచ్చింది. ఐప్యాడ్ టాబ్లెట్ పీసీలను ఆపిల్ సంస్థ భారత్‌లోని ఐస్టోర్‌లలో నేరుగా విక్రయించనుంది. ఈ శుక్రవారం నుంచి మార్కెట్లో ఐప్యాడ్‌లు లభ్యం కానున్నాయి.

గత తొమ్మది నెలల క్రితం అమెరికాలో విడుదలైన ఐప్యాడ్ అతి తక్కువ సమయంలోనే దాదాపు 150 లక్షల ఐప్యాడ్‌లు అమ్ముడై రికార్డు సృష్టించాయి. భారత్‌లో ఆపిల్ ఐప్యాడ్ రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఒకటి వై-ఫై సదుపాయంతో, మరొకటి 3జీ+వై-ఫై సదుపాయాలలో ఇది లభ్యమవుతుంది. భారత్‌లో దీని ప్రారంభ ధర రూ. 27,990గా ఉంది. 3జీ+వై-ఫై వెర్షన్ ధర రూ. 34,900 నుంచి రూ. 44,900 మధ్య ఉంది. ఇకపోతే ఇది 16 జీబీ, 32 జీబీ, 64 జీబీ మెమరీ సామర్థ్యాలలో లభిస్తుంది.

ఇందులో మల్టీ టచ్ యూజర్ ఇంటర్‌ఫేస్, వెబ్ బ్రౌజింగ్, ఈ మెయిల్స్, ఫోటో షేరింగ్స్, హైడెఫినెషన్ వీడియోస్, మ్యూజిక్, గేమ్స్, ఈ-బుక్స్ వంటి ఎన్నో సదుపాయులు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) పోస్ట్-పెయిడ్ మరియు ప్రీ-పెయిడ్‌లలో రూ. 999లకు అపరిమిత యూసేజ్ (అన్‌లిమిటెడ్ యూసేజ్) ఐప్యాడ్ 3జీ డేటా ప్లాన్లను కూడా ప్రకటించింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. స్టాక్ ముగియక ముందే సమీప అవుట్‌లెట్‌కు వెళ్లి మీ ఆపిల్ ఐప్యాడ్‌ను సొంతం చేసుకోండి.

English summary
All movie buffs awaits a movie releases on Friday, but this Friday is something special, even gadget lovers can rejoice. Yes, the US company Apple finally launched its iPad in India on Jan 28. Now, the dream tablet is in a grasp. Visit the nearest retailer or iStore and pick up the tabled device you've always wanted. The Apple iPad went on sale in US nine months ago, within a short span, it has sold nearly 15 million iPad units.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X