అమెరికా ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం ఇండియన్ విద్యార్థులకు చిప్ లాక్స్

భారత విద్యార్థులను అమెరికా ఎంబసీకి పిలిపించి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులను విచారించే నెపంతో వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. వీసా నిబంధనలను అతిక్రమించి విద్యార్థులు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. తీవ్రవాదులకు, కరుడుగట్టిన నేరస్తుల కాళ్లకు మాత్రమే చిప్ లాక్స్ వేస్తారు. కానీ భారత విద్యార్థులకు ఈ చిప్ లాక్స్ వేసి అవమానిస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని అంటున్నారు.
కాగా, భారత విద్యార్థులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నారైలతో కూడిన ఆటా, తానా సంస్థలు కృషి చేస్తున్నాయి. విద్యార్థులకు న్యాయపరమైన సహాయం అందించడానికి ఆటా ఆకుల రాజేష్‌ను నియోగించింది. దీనిపై ఆకుల రాజేష్ సంస్థ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications