ఐఏఎస్ అధికారిణిపై కేసు పెట్టండి: పోలీసులకు కనిగిరి కోర్టు ఆదేశాలు
Districts
oi-Srinivas G
By Srinivas
ఒంగోలు: సీనియర్ ఐఏస్ అధికారిణి రత్నప్రభపై కేసు పెట్టాలని ప్రకాశం జిల్లా కనిగిరి కోర్టు హనుమంతునిపాడు పోలీసులను ఆదేశించింది. వత్సల అనే మహిళ ఫిర్యాదు మేరకు కోర్టు పోలీసులను కేసు పెట్టమని ఆదేశించింది. తనకు ఐఏఎస్ అధికారిణి రత్నప్రభతో ప్రాణహాని ఉందని వత్సల కోర్టులో పిటిషన్ వేసింది. దానిని పరిశీలించిన కోర్టు పోలీసులను కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కాగా వత్సలకు పలుచోట్ల చాలా ఆస్తులు ఉన్నాయని సమాచారం. స్థిర, చరాస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వత్సల ఆస్తులలో రత్నప్రభ కుటుంబానికి కూడా సంబంధం ఉన్నట్లుగా సమాచారం. ఈ ఆస్తుల చాలావరకు బినామీ పేర్లమీద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆస్తుల వ్యవహారంలో విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ వ్యవహారం ముదిరి వత్సల కనిగిరి కోర్టుకెక్కినట్లుగా సమాచారం.