తెరాస, బిజెపిలపై ధ్వజమెత్తిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునే పార్టీలకు తిరిగి అవే సీట్లతో ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. 40, 50 మంది వచ్చి భయపెడితే తాము భయపడబోమని ఆయన అన్నారు. కొంత మంది ఆందోళన చేస్తే బెదిరేది లేదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. తన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి రెచ్చిపోయి పరుష పదజాలం వాడారు. కాంగ్రెసుకు 125 ఏళ్ల చరిత్ర ఉందని, కొద్ది మంది వచ్చి ఆందోళనలు చేస్తే వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications