జగన్, సిఎం వర్గం సవాళ్లు, ప్రతిసవాళ్లకే పరిమితం: హరీష్

అధికారా కాంగ్రెస్, ప్రతిపక్ష టిడిపి పార్టీలు దొంగాపోలీసు, చీకటి వెలుగులాగా లోపాయకారిగా కలిసిపోయాయని ఆరోపించారు. అందుకే చంద్రబాబు అవిశ్వాసం గురించి మాట్లాడటం లేదన్నారు. తెలంగాణపై కేంద్రం డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ఆ ప్రకటనపై చంద్రబాబుకు అడగవలసిన బాధ్యత లేదని అని ప్రశ్నించారు. తెలంగాణ సాధనలో భాగంగా ఫిబ్రవరిలో సహాయ నిరాకరణ చేపడతామన్నారు. పెన్‌డౌన్, హైదరాబాదు దిగ్బంధం ఉంటుందన్నారు. ప్రజలను పన్నులు చెల్లించకుండా చేస్తామని హెచ్చరించారు.
నక్సలైట్లు అయినా, నాశనం అయినా తెలంగాణ ప్రాంతం ఎలా ఉన్నా మా తెలంగాణ మాకు ఇవ్వండని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ హైదరాబాదులో అన్నారు. హైదరాబాదులో సీమాంధ్రులు 15శాతం కూడా లేరని అన్నారు. ప్రాంతాలు, పెట్టుబడుల గురించే కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఆలోచించిందన్నారు. కానీ ప్రజల గురించి ఆలోచించలేదన్నారు.


Click it and Unblock the Notifications