హత్య కుట్రపై డికె అరుణ డోంట్‌కేర్: లైట్‌గా తీసుకున్న మంత్రి

DK Aruna
మహబూబ్‌నగర్: తనపై అగంతకులు చేసిన హత్యను మంత్రి డికె అరుణ లైట్‌గా తీసుకున్నారు. తనపై హత్యా కుట్రను అంతగా సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న తనను భయపెట్టాలనే ప్రయత్నం విజయవంతం కాదని ఆమె అన్నారు. నేను ఎవరి బెదిరింపులకు భయపడనని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తానన్నారు. ఎవరో భయపెడితే భయపడేదానిని కాదన్నారు. అయితే తనకు వచ్చిన బెదిరింపు కాల్సుపై కుటుంబ సభ్యులు భయపడుతున్నారన్నారు. అది ఎవరికైనా సహజమేనన్నారు.

అంతేకాకుండా తన తండ్రి, తమ్ముడు బలి అయిన సంఘటన ఫ్యామిలీకి భయందోళనకు కారణమన్నారు. తనకు ఇంతకుముందు ఎప్పుడూ బెదిరింపు కాల్సు రాలేదన్నారు. అయితే తండ్రి, తమ్ముడు చనిపోయినప్పుడు బెదిరింపు లేఖలు మాత్రం వచ్చాయన్నారు. ప్రజాసేవ కొనసాగింపుపై ఎలాంటి రాజీ లేదన్నారు. కుట్రలో ఎవరు ఉన్నారనే విషయం త్వరలో తెలుస్తుందన్నారు. ఆ కుట్రలో ఉన్నవారని పోలీసులు త్వరలోనే పట్టుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

మంత్రి డికె అరుణకు శనివారం బెదిరింపు కాల్సు వచ్చిన విషయం తెలిసిందే. ఐజ వద్ద అటాక్ చేస్తామని ఓ అగంతకుడు ఫోన్ చేశారు. పోలీసులు రాత్రి సెర్చ్ చేయగా ఆరు డిటోనేటర్లు దొరికాయి. అయితే అంత ప్రమాదమేమి కావని ఎస్పీ చెప్పారు. కాగా డికె అరుణకు బెదిరింపు కాల్ కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి గ్రామంలోని కాయిన్ బాక్సునుండి వచ్చింది. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+