ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేకుంటే బొందపెడతారు: నాగం
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీలు నడుచుకోకుంటే పార్టీలను ప్రజలు బొంద పెట్టడం ఖాయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారం అన్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం అయినా చేసుకుంటాం కానీ అమ్ముడు పోమని అన్నారు. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కట్టుబడి ఉందని చెప్పారు. రాజకీయ భవిష్యత్తు ఇచ్చేది ప్రజలే కానీ పార్టీలు కాదన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా అన్ని పార్టీలు నడుచుకోవాలన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఏ పార్టీ నడుచుకోకున్నా ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదన్నారు. ప్రజలు కోరుకుంటున్న తెలంగాణకు ప్రతి పార్టీ మద్దతు ప్రకటించాలని అన్నారు.