హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిక్కుల్లో మహిళా ఐపిఎస్: తేజ్‌దీప్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tejdeep Kaur Menon
హైదరాబాద్: ఓ మహిళను వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపిఎస్ అధికారిణి తేజ్‌దీప్ కౌర్‌ను ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తనకు సంబంధం లేకపోయినా ఓ కుటుంబ తగాదా విషయంలో తన గన్‌మెన్‌లను తీసుకెళ్లి ఓ మహిళా అధికారిని తేజ్‌దీప్ కౌర్ వేధించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. స్థానిక పోలీసులు, సీఐడీలు తేజ్‌దీప్‌కౌర్‌ను విచారించినా ఫలితం లేకపోవడంతో ఆమె జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం బాధిత మహిళకు రూ.4 లక్షలను పరిహారంగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హక్కుల కమిషన్ ఆదేశించింది. ఆ డబ్బులను పోలీసు సంక్షేమ నిధి నుంచి చెల్లించారు. ఈ కారణంగా కౌర్ నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది.

దీంతో ఆమెను వేధింపుల కేసులో ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫైలు సీఎం కార్యాలయానికి చేరింది. ఒకటి, రెండు రోజుల్లో దానికి సీఎం ఆమోదం కూడా లభించనుంది. కాగా ఇక్కడ మరో వివాదం తెరపైకి వచ్చింది. తేజ్‌దీప్ కౌర్ తనకు ఇష్టమైన వారిని సంతృప్తి పర్చడానికి అధికార దర్పాన్ని ప్రదర్శించి కమిషన్ ఆగ్రహానికి గురైతే, పరిహారాన్ని పోలీసు సంక్షేమ నిధి నుంచి చెల్లించడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ అంశం ఆ శాఖలో దుమారం రేపుతోంది. పోలీసు కుటుంబాలకు ఆసరా కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధి నుంచి ఏకంగా రూ. 4 లక్షలను ఆమె కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది.

తేజ్‌దీప్ కౌర్ అధికార విధుల నిర్వహణలో భాగంగా చేసిన చర్యకు ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందే కానీ, అమాయకులను వేధించి జరిమానాకు గురైతే ప్రభుత్వానికి ఏం సంబంధమనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక వేళ కమిషన్ ఆదేశాలు అలా ఉన్నా తమకు సంబంధం లేదని, ఉత్తర్వులు ఆమెకే ఇవ్వాలని కమిషన్‌ను మళ్లీ కోరి ఉండాల్సిందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ నిధి ఉద్దేశాలను దెబ్బతీసేలా ఆమె కోసం ఈ నిధిని ఖర్చు చేయడం తీవ్ర తప్పిదమేనని వారంటున్నారు. అయితే తాము చెల్లించిన మొత్తాని వసూలు చేస్తామని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X