సోనియాతో చిరంజీవి భేటీ, అల్లు అరవింద్‌కు రాజ్యసభ సీటు

కాగా, చిరంజీవి వెంటనే ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. రేపటి నుంచి చిరంజీవి తిరుపతి పర్యటన చేయాల్సి ఉంది. ఆ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. దీన్నిబట్టి ఆయన వెంటనే ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుని, చిరంజీవిని ప్రభుత్వంలో చేర్చుకుంటుందని అంటున్నారు. తొలి విడతగా జగన్ వర్గానికి చెందిన నలుగురైదుగురు శాసనసభ్యులపై వేటు పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన నలుగురైదుగురు శానససభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాగా, చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్‌కు రాజ్యసభ సీటు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. సి. రామచంద్రయ్య కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు.












Click it and Unblock the Notifications