హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పోలవరం పాదయాత్ర తేదీలు ఖరారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన పోలవరం పాదయాత్ర ఫిబ్రవరి 7వ తేదినుండి 10వ తేది వరకు జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఈ యాత్రకు హరిత యాత్ర అని పేరు పెట్టారు. ప్రజల సమస్యల పరిష్కారానికి లక్ష్యదీక్ష, జలదీక్ష, జనదీక్షలు చేపట్టిన జగన్ ఇప్పుడు తాజాగా తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వైయస్ మృతి తర్వాత నత్తనడకన సాగుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రైతులకు న్యాయం చేయాలంటే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ చేస్తూ తన తండ్రి బాటలో ఉభయ గోదావరి జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించనున్నారు.

జగన్ పాదయాత్ర ఫిబ్రవరి 7వ తేదిన 10.30 గంటలకు ఆత్రేయపురం నుండి ప్రారంభం కానుంది. పేరవరం, కొవ్వూరు తదితర గ్రామాలమీదుగా 8వ తేది, 9వ తేదిన పాదయాత్రతో 10వ తేదికి పోలవరానికి చేరుకుంటారు. అదేరోజు పోలవరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం నాలుగు రోజులు సాగే ఈ పాదయాత్రలో 73 కిలోమీటర్లు ఉంటుంది.ఇందులో పాల్గొనమని చెప్పి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఎవరినీ కోరమని ఆలాగే ఇష్టం ఉన్న వారు పాల్గొనవచ్చునని జగన్ వర్గం పేర్కొంటుంది. జగన్ పాదయాత్రతో ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతులకు నీటి వసతిని కల్పిస్తుందని జగన్ వర్గం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X