జగన్, వైయస్సార్ పాత్రలపై ఆనాడే చెప్పాం: పరిటాల కేసుపై చంద్రబాబు

రాష్ట్రాన్ని కాంగ్రెసు కుక్కలు చింపిన విస్తరిలా చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు గణనీయంగా తగ్గాయని, ఈ విషయంలో బీహార్ కన్నా రాష్ట్రం వెనకబడిపోయిందని, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు గుజరాత్‌కు తరలిపోతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెసు తీరు వల్లనే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు తరలిపోతున్నాయని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా రైతులు 800 కోట్ల రూపాయల విలువ చేసే పంట నష్టపోయారని ఆయన చెప్పారు. బీమా పథకం కింద వేయి కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, కానీ ప్రభుత్వం నిర్లక్యం వల్ల 200 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications