చిరంజీవితో కాంగ్రెసు పొత్తు ప్రతిపాదనపై దామోదర్ రెడ్డి ఫైర్

పార్టీకి నష్టం జరగకుండా ఉండాలంటే చిరంజీవి మద్దతు తీసుకోవద్దని ఆయన అన్నారు. సమైక్యవాది అయిన చిరంజీవి వల్ల తెలంగాణలో కాంగ్రెసుకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు పార్టీ ఈ ప్రాంతంలో భూస్థాపితమవుతుందని ఆయన అన్నారు. సమైక్యవాది చిరంజీవితో ఎలా స్నేహం చేస్తారని ఆయన పార్టీ అధిష్టానాన్ని అడిగారు. తెలంగాణలో కాంగ్రెసు నేతలు తిరగలేని స్థితిలో చిరంజీవి సహకారం తీసుకుని తప్పు చేస్తోందని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తే అభ్యంతరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇతర పార్టీలను విమర్సించడం మానుకుని ఉద్యమంపై దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications