చిరంజీవికి వైయస్ జగన్‌తో పోలికే లేదు: పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్

D Srinivas
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు పోలిక లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. వైయస్ జగన్‌కు చెక్ పెట్టేందుకే చిరంజీవితో కాంగ్రెసు దోస్తీ కడుతోందనే వార్తలను ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. చిరంజీవితో తమ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు ఎకె ఆంటోనీ భేటీ సినిమాలో ఓ సన్నివేశం మాత్రమేనని, సినిమాలో ఇంకా చాలా సన్నివేశాలున్నాయని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణకు చిరంజీవితో స్నేహానికి సంబంధం లేదని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ మంత్రివర్గంలో చేరుతుందా, కాంగ్రెసులో విలీనమవుతుందా అనేది తనకు తెలియదని, చిరంజీవితో స్నేహంపై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుందని, దీనికి పార్టీ నాయకులంతా కట్టుబడి పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను కూడా పార్టీ అధిష్టానమే పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు. చిరంజీవితో స్నేహం రాజకీయ వ్యూహంలో భాగమని ఆయన అన్నారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు ఇతరులకు లేదని ఆయన అన్నారు.

చిరంజీవితో దోస్తీపై దాపరికం ఏమీ లేదని ఆయన చెప్పారు. ఎన్నికల్లో 18 శాతం ఓట్లు వచ్చిన ఓ పార్టీ అధ్యక్షుడితో తమ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు మాట్లాడడంలో తప్పు లేదని ఆయన చిరంజీవితో ఎకె ఆంటోనీ భేటీపై వ్యాఖ్యానించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ పెద్ద మనిషి ద్వారా చిరంజీవికి ఆహ్వానం పంపారని ఆయన చెప్పారు. చిరంజీవితో ఆంటోనీ భేటీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసునని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+