కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైయస్ జగన్

దేశంలోనే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనన్నారు. మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద జిల్లాకు రూ.114 కోట్లు బకాయిలు రావల్సి ఉందన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పైసా కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. కమిషన్లు వేయటం తప్పా ప్రభుత్వాలు ముస్లింలకు చేసింది ఏమీ లేదని జగన్ అన్నారు. పేదల సంక్షేమం ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ఆయన విమర్శించారు. ఫీజుల రీయంబర్స్‌మెంటులో ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications