హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి ఆరోపణలపై పశ్యాత్తాప పడుతున్నా: జెసి దివాకర్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు చేసిన అవినీతి మంత్రులందరికీ తెలియాలని లేదని మాజీ మంత్రి, అనంతపురం తాడిపత్రి శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోమవారం విలేకరులతో అన్నారు. నేను మంత్రిగా పని చేసినప్పుడు నా శాఖలో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో అవినీతి జరిగిందన్నా చిరు ఆరోపణలపై తాను పశ్చాత్తాపం చెందుతున్నానన్నారు. అయితే ఒకరు చేసిన అవినీతి అందరికీ తెలియాలని లేదనే విషయం గమనించాలన్నారు. విధాన నిర్ణయాల్లో మాత్రమే అవినీతి జరిగితే మంత్రుల బాధ్యత ఉంటుందని చెప్పారు.

నాకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేవన్నారు. ఒకవేళ ఇచ్చినా నేను తీసుకోనని స్పష్టం చేశారు. తెలంగాణకు, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎందుకంటే విభజనను నిర్ణయించేది చిరంజీవి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విభజన విషయాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. చిరంజీవి కాంగ్రెస్‌తో కలవడం వల్ల పార్టీ మరింత బలపడుతుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు యథావిధిగా జరుగుతాయని చెప్పారు. సజావుగానే జరుగుతాయన్నారు. సమావేశాలను అడ్డుకుంటామనే ప్రకటనలు చాలా చూశామని అన్నారు.

పోలవరం సాధన కోసం మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న హరితయాత్ర మంచిదే అన్నారు. పాదయాత్ర ద్వారా పోలవరం ఆవశ్యకతను ప్రజలకు వివరించడం మంచిదే కదా అన్నారు. జగన్ పాదయాత్రలో శాసనసభ్యులు, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కావడం వారి వారి ఇష్టం అన్నారు. వారిపై చర్యలపై కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లేదా పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X