హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష, ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మంగళవారం ఉదయం ఒక రోజు దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష సాయంత్రం వరకు సాగుతుంది. విద్యాసంస్థలు జులైలో ప్రారంభమైనా ఇప్పటి వరకు ఫీజు రీయంబర్స్‌మెంటు మొత్తాలను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. వెంటనే ఆ సొమ్మును విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రీయంబర్స్‌మెంటు, ఉపకార వేతనాల్లో కోత విధించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోందని, అదే గనుక జరిగితే తాము నిరవధిక ఆందోళనకు దిగుతామని ఆయన అన్నారు. ఫీజుల రీయంబర్స్‌మెంట్ కోసం బడ్జెట్‌లో ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతుగా బిజెపి కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు.

English summary
State president of BJP G Kishan Reddy has began his oneday fast today, in protest against the delay in releasing fee reimbursement to the students. He warned the Government his party will launch indefinite agitation, if the issue will not be solved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X