వైయస్ జగన్ మళ్లీ వస్తారు, కెసిఆర్ కాంగ్రెసులో కలుస్తారు: లగడపాటి

రాజకీయ అవగాహన లేకనే చిరంజీవి ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని, రాజకీయ అవగాహనతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారని ఆయన అన్నారు. రెండేళ్ల ప్రయత్న ఫలితంగా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం అయిందని, చిరంజీవిలో మార్పు వచ్చి విలీనానికి అంగీకరించారని ఆయన అన్నారు. చిరంజీవిలో వచ్చిన మార్పు తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనూ రావాలని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఏదో జాతీయ పార్టీలో విలీనం చేయాలని ఆయన సూచించారు. చిరంజీవిలో వచ్చిన మార్పు వస్తే చంద్రబాబును, కెసిఆర్‌ను కాంగ్రెసులో చేర్చుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనపై రెండో ఎస్సార్సీయే కాంగ్రెసు పార్టీ విధానమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications