మద్దెలచెర్వు సూరి హత్య కేసులో వల్లభనేని వంశీ విచారణ

Vallabhaneni Vamsi
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసుకు సంబంధించి సిసిఎస్ పోలీసులు సోమవారం రాత్రి విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీని విచారించారు. వంశీని సాయంత్రం ఆరు ఏడు గంటల సమయంలో సిసిఎస్ కార్యాలయానికి వెళ్లినప్పటికీ అర్థరాత్రి వరకు మీడియాకు తెలియలేదు. సుమారు ఐదుగంటలపాటు వంశీని పోలీసులు విచారించారు. సాయంత్రం ఆరుగంటలనుండి రాత్రి 11 గంటల వరకు వంశీని పోలీసులు విచారించినట్టుగా తెలుస్తోంది.

కాగా మద్దెలచెర్వు సూరి భార్య గంగుల భానుమతి ఇచ్చిన వాంగ్మూలం మేరకు వల్లభనేని వంశీని సిసిఎస్ పోలీసులు విచారించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని, అవసరమైతే మళ్లీ విచారణకు రావడానికి కూడా సిద్ధమని, తాను హత్యా రాజకీయాలుకు దూరం అని వంశీ పోలీసులుకు చెప్పారని సమాచారం. అయితే వంశీని విచారించిన పోలీసులు తర్వాత పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్‌ను, మంగలి కృష్ణను త్వరలో విచారించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+