ఢిల్లీకి డి. శ్రీనివాస్: ఇక వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు
State
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ:
చిరంజీవి
నాయకత్వంలోని
ప్రజారాజ్యం
పార్టీ
తమ
పార్టీలో
విలీనం
కావడానికి
పచ్చ
జెండా
ఊపిన
స్థితిలో
ఇక
తదుపరి
ఆపరేషన్‌కు
కాంగ్రెసు
అధిష్టానం
సిద్ధమవుతున్నట్లు
తెలుస్తోంది.
మాజీ
పార్లమెంటు
సభ్యుడు
వైయస్
జగన్
వెంట
వెళ్తున్న
శాసనసభ్యులపై
వేటు
వేసేందుకు
రంగం
సిద్ధం
చేయనున్నట్లు
తెలుస్తోంది.
ఇందులో
భాగంగానే
ప్రదేశ్
కాంగ్రెసు
కమిటీ
(పిసిసి)
అధ్యక్షుడు
డి.
శ్రీనివాస్
మంగళవారం
ఢిల్లీ
వచ్చారని
చెబుతున్నారు.
మంగళవారం
ఉదయం
హైదరాబాదులో
చిరంజీవి
తనతో
కలిసి
చెప్పిన
విషయాలను
కూడా
ఆయన
సోనియాలో
చెవిలో
చెప్పనున్నట్లు
తెలుస్తోంది.
డి.
శ్రీనివాస్
రేపు
బుధవారం
సోనియా
గాంధీని
కలుస్తున్నారు.
పార్టీ
అధిష్టానానికి
చెందిన
ఇతర
పెద్దలను
కూడా
ఆయన
కలుస్తారు.
వైయస్
జగన్
వెంట
వెళ్తున్న
శాసనసభ్యులపై
చర్యలకు
తగిన
చర్యలను
సోనియా
సూచన
మేరకు
డిఎస్
చేపడతారని
అంటున్నారు.
దీనిపై
చర్చకే
ఆయన
ఢిల్లీ
వెళ్లినట్లు
తెలుస్తోంది.
అందువల్లనే
వీలైతే
వరంగల్
జిల్లాకు
చెందిన
శాసనసభ్యురాలు
కొండా
సురేఖను
వెనక్కి
రప్పించే
ప్రయత్నం
ఆయన
చేసినట్లు
చెబుతున్నారు.
అవసరమైతే
కొండా
సురేఖపై
చర్యలు
తీసుకోవడాన్ని
వాయిదా
వేసి,
జగన్
వెంట
వెళ్తున్న
కొద్ది
మందిపై
చర్యలు
చేపట్టే
అవకాశాలున్నాయి.
సురేఖ
వైయస్
జగన్
వర్గం
ఒత్తిడి
వల్లనే
తిరిగి
మీడియా
సమావేశం
ఏర్పాటు
చేసి,
చిరంజీవిపై
ధ్వజమెత్తినట్లు
చెబుతున్నారు.
ఆమె
కాంగ్రెసు
పట్ల,
సోనియా
పట్ల
కాస్తా
మెత్తబడినట్లు,
అందుకు
అనుగుణంగానే
తన
వ్యాఖ్యల్లో
వాడిని
తగ్గించినట్లు
చెబుతున్నారు.
తొలి
విడతగా,
జగన్
వెంట
వెళ్తున్న
శ్రీకాంత్
రెడ్డి,
గురునాథ్
రెడ్డి,
ఆదినారాయణ
రెడ్డి,
బాలినేని
శ్రీనివాస
రెడ్డి,
పిల్లి
సుభాష్
చంద్రబోస్
వంటి
కొద్ది
మంది
మీద
తొలి
విడత
చర్యలు
తీసుకుంటారని
అంటున్నారు.
ఈలోగా,
జగన్
వెంట
వెళ్తున్న
మరి
కొద్ది
మందిని
తమ
వైపు
తిప్పుకోవాలని
డిఎస్
ఆలోచన
చేస్తున్నారు.
ఆ
చర్యల
ద్వారా
పార్టీని
గాడిలో
పెట్టే
పనికి
పూనుకుంటారని
అంటున్నారు.
Well, the role of PCC president has become so minuscule in A.P that nobody heeds to the advise of him anymore.The
congress leaders in andhra pradesh are openly defecting the guidelines of the party and our PCC chief D.Srinivas is
going on issuing his comedy warnings.
Story first published: Wednesday, February 9, 2011, 18:30 [IST]