బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు ఇవే..!
నందమూరి నటసింహం బాలయ్యకి దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తెరపై ఆయన మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు. ఒక వైపు రాజకీయంగా తన తండ్రి పెట్టిన తెలుగు దేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు సినిమాల్లో కూడా వరుసగా ఐదు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు.
కాగా నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో వందకు పైగా చిత్రాల్లో నటించి, నేటితరం హీరోలకు సైతం గట్టి పోటీనిస్తూ బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులను సృష్టిస్తున్నారు. నేడు (జూన్ 10) బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఆ నటసింహం కెరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం ప్రత్యేకంగా..

- పౌరాణిక, జానపద, సాంఘిక, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ఇలా ప్రతి జానర్‌లోనూ నటిస్తూ అద్భుతమైన వైవిధ్యం కనబరిచారు.
- చెంఘీజ్ ఖాన్, గోన గన్నారెడ్డి వంటి చారిత్రక పాత్రల్లో నటించాలనేది ఆయన చిరకాల కోరిక.
- ఇప్పటి వరకు ఆయన ఒక్క రీమేక్ చిత్రంలో కూడా నటించలేదు.
- 17 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు.
- తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి పదికి పైగా చిత్రాల్లో తెరను పంచుకున్నారు.
- లక్ష్మీనరసింహ స్వామిపై అపారమైన భక్తి కలిగిన బాలకృష్ణ, తన చిత్రాల టైటిల్స్‌లో 'సింహా' అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
- బాలకృష్ణ తెల్లవారుజామునే నిద్రలేచి, పూజా కార్యక్రమాల తర్వాతే రోజువారీ పనులను ప్రారంభిస్తారు.
ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ.. ప్రస్తుతం తన లైనప్‌లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను ఉంచారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలోనూ మరో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.












Click it and Unblock the Notifications