ఫలక్ నుమా, ఈస్ట్ కోస్ట్, షాలిమార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్..!
ఆగ్నేయ రైల్వే పరిధిలోని ఖరగ్ పూర్ డివిజన్ లో ఉన్న బాలేశ్వర్ స్టేషన్ ఆధునీకరణ, నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా సికింద్రాబాద్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను (Express trains) రద్దు చేశారు. ఇందులో ఫలక్ నుమా, ఈస్ట్ కోస్ట్, షాలిమార్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఆయా రైళ్లను ఏయే తేదీల్లో రద్దు చేశారు, ఇతర వివరాలను అధికారులు ఇవాళ ప్రకటించారు. కాబట్టి ఈ రైళ్లలో ప్రయాణించే వారు వీటిని గమనించాల్సి ఉంటుంది.
ముందుగా సికింద్రాబాద్-హౌరా ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు (12704)ను జూలై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకూ రద్దు చేశారు. అలాగే హౌరా నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు (12703)ను కూడా జూలై 29 నుంచి ఆగస్టు 9 వరకూ రద్దు చేశారు. షాలిమార్ నుంచి చర్లపల్లికి వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ (18045)ను ఆగస్టు 4వ తేదీన రద్దు చేశారు. అలాగే చర్లపల్లి నుంచి షాలిమార్ కు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు (18046)ను ఆగస్టు 6న రద్దు చేశారు.

వీటితో పాటు మరో రెండు రైళ్లు కూడా రద్దయ్యాయి. వీటిలో షాలిమార్ -సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ రైలు (22849)ను ఆగస్టు 5న రద్దు చేశారు. అలాగే సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్ ప్రెస్ రైలు (22850)ను ఆగస్టు 7న రద్దు చేశారు. కాబట్టి ఆయా మార్గాల్లో, ఈ రైళ్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నాన్ ఇంటర్ లాకింగ్ పనులు పూర్తి కాగానే తిరిగి ఈ రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయని తెలిపారు.












Click it and Unblock the Notifications