'ఆల్ఫా' టీజర్ వచ్చేసింది.. కానీ ఆ స్టార్ హీరోయిన్ ఎక్కడ? ఫ్యాన్స్ క్రేజీ డౌట్స్!

యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. టైగర్, కబీర్, పఠాన్ వంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్లతో ఓ భారీ స్పై యూనివర్స్‌ను నిర్మించిన ఆదిత్య చోప్రా.. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీని సరికొత్త మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు అలియా భట్, శర్వరీలపై భారీ పెట్టుబడిని పెట్టారు. ఈ టీజర్‌లో అలియా భట్ పాత్ర 'సీత'ను పరిచయం చేశారు. చిన్నప్పటి నుంచి కఠినమైన శిక్షణ పొంది.. దేశం కోసం ప్రాణాలర్పించే ఓ ఎలైట్ సీక్రెట్ ఏజెంట్‌గా ఆమెను చూపించారు. యాక్షన్ బ్లాక్స్, ట్రైనింగ్ మోంటేజ్‌లు, పేలుళ్లు, హై-వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్‌లతో విజువల్స్ పరంగా టీజర్ చాలా గ్రాండ్‌గా,యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ స్థాయికి తగ్గట్టుగా ఉంది.

కానీ ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో.. అంతే స్థాయిలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను, అనుమానాలను కూడా రేకెత్తించింది. ఈ సినిమాకు సంబంధించి మొదటి, అతిపెద్ద సవాలు ఏమిటంటే.. అలియా భట్ ఓ పూర్తి స్థాయి యాక్షన్ స్టార్‌గా ప్రేక్షకులను మెప్పించగలదా? అనేది. అలియా భట్ ఇప్పటికే వైవిధ్యమైన పాత్రల్లో తన నటనను నిరూపించుకుంది. అయితే ఓ భారీ యాక్షన్ ఫ్రాంచైజీని తన భుజాలపై మోయడం అనేది పూర్తిగా భిన్నమైన టాస్క్. టీజర్‌లో యాక్షన్ స్టంట్స్ స్టైలిష్‌గా ఉన్నప్పటికీ.. ఒక పూర్తి స్థాయి సినిమాలో ఆమె ఆ ఇంటెన్సిటీని ఎంతవరకు మెయింటైన్ చేయగలదనేది అసలైన పరీక్షగా మారనుంది.

Alpha Teaser Out Alia Bhatt Nails Action but Where is Co-Star Sharvari Wagh Fans Question Details

లీడ్ హీరోయిన్ 'శర్వరీ' పాత్ర ఏది? కావాలనే దాచారా?
ఇక రెండో పెద్ద చర్చనీయాంశం.. టీజర్‌లో శర్వరీ పాత్ర అస్సలు కనిపించకపోవడం. ఈ సినిమాలో శర్వరీ కూడా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ అని మొదటి నుంచి ప్రచారం చేశారు. కానీ టీజర్ మొత్తం కేవలం అలియా భట్ చుట్టూనే తిరిగింది. దీనితో చిత్ర బృందం ఆమె పాత్రను కావాలనే దాచిందా? లేక ట్రైలర్‌లో సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారా? అని అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. వీటికి తోడు, సాధారణంగా ఒక పెద్ద స్పై యూనివర్స్ సినిమా టీజర్ వస్తే ఉండే రేంజ్ ఎలివేషన్లు ఇందులో కనిపించలేదు. పఠాన్, వార్, లేదా టైగర్ చిత్రాల ఫస్ట్ లుక్స్‌లో ఉన్నట్లుగా.. ఇందులో ఒక్క డైలాగ్ కానీ, ఒక ఐకానిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ ప్రేక్షకులను వెంటనే పిచ్చెక్కించే స్థాయిలో లేకపోవడం గమనార్హం.

మరోవైపు, ఈ సినిమా రైటింగ్‌పై కూడా సోషల్ మీడియాలో కొన్ని భయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ చిత్రానికి ఉదయ్ చోప్రా కథను అందించారు. ఆదిత్య చోప్రా కథలు రాసిన 'టైగర్ 3', 'వార్ 2' వంటి చిత్రాలు కథ పరంగా కొన్ని విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో.. రైటర్‌గా డెబ్యూ ఇస్తున్న ఉదయ్ చోప్రా ఎంతవరకు ఒక సరికొత్త, ఉత్కంఠభరితమైన కథను ఇవ్వగలడనే సందేహం ఫ్యాన్స్‌లో ఉంది. అయితే ఈసారి ఇండియా-పాకిస్తాన్ జాయింట్ మిషన్ అనే రెగ్యులర్ ఫార్ములాను పక్కన పెట్టడం ప్రేక్షకులకు కాస్త ఉపశమనం కలిగించే విషయమే. మొత్తంమీద 'ఆల్ఫా' టీజర్ క్యూరియాసిటీని పెంచినప్పటికీ, థియేటర్లలో ఈ సినిమా ఏ రేంజ్ కమ్‌బ్యాక్ ఇస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+