సోనియాతో అసంతృప్తుల భేటీ: కాంగ్రెసు‌కు వ్యతిరేకం కాదని ఉవాచ

Sonia Gandhi
న్యూఢిల్లీ: అసమ్మతి కాంగ్రెసు శాసనసభ్యులు, మాజీ మంత్రులు శిల్పామోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సోనియాతో భేటీ అయిన వారు తాము కాంగ్రెసు పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆమెకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి మాత్రమే తాము వ్యతిరేకమని ఆమెకు చెప్పినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు పట్ల ఎప్పుడూ అసంతృప్తితో లేమని చెప్పారని తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ సోనియా భేటీ అనంతరం వీరు సోనియా వద్దకు వెళ్లారు. అయితే సోనియాతో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడకుంటా వెళ్లారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తాను వ్యతిరేకంగా పనిచేస్తానని రామచంద్రా రెడ్డి గతంలో బహిరంగంగా ప్రకటించారు. కిరణ్ కుమార్ రెడ్డిని గద్దె దించే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. మరో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కూడా కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నారు. మంత్రివర్గంలో తమకు చోటు దక్కకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+