హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో ప్రస్తుత పరిస్థుతుల పాపం కేంద్రానిది: ఎర్రబెల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని తెలంగాణ జిల్లాల్లో వెంటనే రద్దు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు గురువారం డిమాండ్ చేశారు. రచ్చబండ పేరుతో తెలంగాణవారిని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రచ్చబండ పేరుతో తెలంగాణ జిల్లాల్లో ఉన్న అమాయక ప్రజలపై పోలీసులు దౌర్జన్యంగా లాఠీఛార్జీలు, అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. సిఎం రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని మొదట ప్రజాపథంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. గత డిమాండ్లు పరిష్కరించకుండా ప్రజల వద్దకు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే ఎమర్జెన్సీ గుర్తుకు వస్తుందన్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా ప్రత్యేక తెలంగాణ ప్రకటించాలని ఆయన అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు కానుక అంటూ తెలంగాణ ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకూ ఆ మాటను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చుకోలేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రకటించాలన్నారు. తెలంగాణ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తెలంగాణ జిల్లాల్లో అల్లకల్లోలం సృష్టించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆరోపించారు. 400 మందికి పైగా విద్యార్థులు చనిపోవడానికి కారణం కూడా కేంద్రం అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ను ఈడ్చుతామని చెప్పిన టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఇప్పుడు మాట్లాడటం లేదు అని అన్నారు.

English summary
TDP Telangana MLA errabelli Dayakar Rao demanded CM Kiran kumar Reddy to cancel his Rachabanda Program in Telangana districts, today at NTR trust bhavan in a press conference. He accused 400 students dead due to Central government irresponsible statement. He also fired at TRS president KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X