హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే కొండా సురేఖ ఎఫెక్ట్: వైయస్ జగన్ తెలంగాణ ఓదార్పు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ పెద్ద షాకే ఇచ్చినట్టున్నారు. కొండా సురేఖ ఇచ్చిన షాక్ వల్లే జగన్ తెలంగాణ ఓదార్పు అంటున్నట్టుగా తెలుస్తోంది. జగన్ వర్గం అంబటి రాంబాబు త్వరలో సీమాంధ్ర మాదిరి తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర ఉంటుందని చెప్పారు. అయితే ఈ తెలంగాణ ఓదార్పు వెనుక కొండా సురేఖ ఇచ్చిన ఝలక్ కారణమని పలువురు భావిస్తున్నారు. వైయస్ జగన్‌ వర్గంలో కొండా సురేఖ వంటి వారికి ఓ ప్రత్యేకత ఉంది. ఆమె మంత్రి పదవులుకన్నా జగన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అయితే తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఈ నేపథ్యంలో జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోక పోవడం, సీమాంధ్ర తరహా తెలంగాణలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టక లేదు.

అంతకన్నా ముఖ్యంగా జగన్ పార్టీ విధివిధానాలలో తెలంగాణ అంశం లేదనే వాదనల దృష్ట్యా ఆమె తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా క్రమంగా కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నట్టు కథనాలు వచ్చాయి. అంతకుముందు జగన్‌కు అనుకూలంగా, కాంగ్రెస్, సోనియాలపై విపరీతంగా ధ్వజమెత్తిన సురేఖ బుధవారం మీడియా సమావేశంలో మాత్రం కాంగ్రెస్ మంచికోసమని, డిఎస్ ముఖ్యమంత్రి పదవి అంటూ సోనియాపై కాస్త ఆచితూచి విమర్శలు చేశారు. జగన్‌తోనే ఉండాలని సురేఖపై జగన్ వర్గం ఒత్తిడి తీసుకు వచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ వంటి తన తెలంగాణ నేతలలో ఉత్సాహం నింపడానికే జగన్ తెలంగాణ ఓదార్పు కార్యక్రమానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.

English summary
MLA Konda Surekha was gave shock to Ex MP YS Jagan. By her effect Jagan decided to make Odarpu yatra in Telangana. Ambati Rambabu announced today on behalf of YS Jagan on Odarpu yatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X