అయోమయంలో కొండా సురేఖ: వేటు భయంతో వెనక్కి తగ్గిందా?

ఈ కారణంగానే ఆమె పిసిసి అధ్యక్షుడు డిఎస్‌తో సమావేశమయినట్లుగా తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా జగన్‌ను విడిచి జనం వెంట వెడదామనే సురేఖ నిర్ణయించుకున్నట్లుగా కథనాలు వచ్చాయి. దీంతో ఖంగుతిన్న జగన్ వర్గం ఆమెపై ఒత్తిళ్లు తెచ్చినట్టుగా తెలుస్తోంది. జగన్‌తో మొదటి నుండి ఉన్న సురేఖ ఆయన వెంట నడువకుంటే జనంలోకి తప్పుడు సంకేతాలు వస్తాయని భావించిన జగన్ వర్గం ఆమెకు తెలియకుండానే కొండా సురేఖ పేరుతో సోనియాను ఘాటుగా విమర్శిస్తూ లేఖను సృష్టించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వా సురేఖ ప్రెస్ మీట్ పెట్టి తాను జగన్ వెంటే ఉంటానని చెప్పినప్పటికీ పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉదయమే సోనియాపై అంతలా లేఖలో విరుచుకు పడ్డ సురేఖ ప్రెస్ మీట్‌లో మాత్రం సున్నితంగా హెచ్చరికలు చేశారు. కొత్తగా పార్టీ పెడుతున్న జగన్ వెంటే ఉంటానని చెబుతూనే కాంగ్రెసు పార్టీ బాగుకోసం అంటూ మాట్లాడారు. అంతేకాదు కొత్తగా డిఎస్‌కు ముఖ్యమంత్రి పదవి అంటూ కొత్తగా మాట్లాడారు. బుధవారం నాటి ప్రెస్ మీట్‌లో ఆమె నోటినుండి విలేకరులు ఊహించని మాటలే వచ్చాయి.
సోనియాను ఘాటుగా విమర్శించక పోవడం, ఒత్తిళ్లపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం, హరితయాత్రపై స్పందించక పోవడమే కాకుండా నిన్నటి వరకు జగన్ జపం చేసి ఒక్కసారిగా డిఎస్‌కు ముఖ్యమంత్రి పదవి అంటూ చెప్పడం అన్నీ కొత్త విషయాలే. అయితే సోనియాపై గతంలో చేసిన ఘాటు విమర్శలు ఈసారి చిరంజీవి ఖాతాలోకి వెళ్లాయి. సురేఖ వెనక్కి తగ్గడానికి మరో బలమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఆమెపై అధిష్టానం చర్యలు తీసుకుంటానని హెచ్చరించిన దృష్ట్యా సమైక్యవాది జగన్‌తో వెళితే ప్రజలు మళ్లీ గెలిపించే అవకాశాలు లేవు. ఈ కారణంగా ఆమె కాంగ్రెసులో ఉండి పోదామని అంతిమంగా నిర్ణయించుకున్నట్లు కూడా వినవస్తోంది. రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా జగన్‌కు దూరం జరుగుదామని అనుకున్నప్పటికీ ఒక్కసారిగా కాకుండా మెల్లిమెల్లిగా జరగాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.