హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ అనుకూల లేఖ రాసినందుకు విద్యార్థికి బెత్తం దెబ్బలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: పాఠశాల పోటీల్లో తెలంగాణకు అనుకూలంగా లేఖ రాసినందుకు స్కూల్ ప్రిన్సిపాల్ తమ కుమారుడిని కొట్టినట్లు ఎనిమిదో తరగతి విద్యార్థి తల్లిదండ్రులు హైదరాబాదులోని చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిల్‌షుక్‌నగర్ సమీపంలోని రామకృష్ణాపురంలో గల వీనస్ పబ్లిక్ స్కూల్లో చదుపుతున్న 13 ఏళ్ల విద్యార్థి సాయి దర్శన్‌ను ప్రిన్సిపాల్ కొట్టినట్లు పోలీసులకు బుధవారం ఆ ఫిర్యాదు అందింది.

స్కూల్ యాజమాన్యం మంగళవారం లేఖలు రాయడంలో పోటీలు నిర్వహించిందని, స్థానిక సమస్యలను తెలియజేస్తూ సాయి దర్శన్ తెరాస అధ్యక్షుడు కెసిఆర్ రాసినట్లు లేఖ రాయడం ప్రారంభించాడని, కింద మీ విధేయుడు కెసిఆర్ అని సంతకం చేశాడని పోలీసులు చెప్పారు. బుధవారం జవాబు పత్రాలను దిద్దిన స్కూల్ ప్రిన్సిపాల్ రాధ సాయి దర్శన్ రాతను గుర్తు పట్టి పిలిచి అతన్ని బెత్తంతో తీవ్రంగా కొట్టింది. సాయి దర్శన్ తండ్రి ఎల్లేష్ గౌడ్ తెలంగాణవాదుల ఒత్తిడి మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అది చిన్న సంఘటన అని, ఏ టీచర్ కూడా ఏ విద్యార్థినీ కొట్టలేదని చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ ఎల్ ఆనంద భాస్కర్ చెప్పారు.

English summary
Parents of a Class VIII student lodged a complaint with the Chaitanyapuri police on Wednesday, alleging that their son was thrashed by the school principal for writing a pro-Telangana letter in a school competition. The student, Sai Darshan, 13, who was beaten up, is studying in Venus Public School located at Ramakrishnapuram near Dilsukhnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X