వరంగల్, కరీంనగర్ బంద్, ఉద్రిక్తం: సిఎం రావద్దంటూ నినాదాలు

ముఖ్యమంత్రి రచ్చబండను ఎవరూ ఆమోదించడం లేదని వారు ఆరోపించారు. బలవంతంగా గ్రామస్తులను కార్యక్రమానికి తీసుకు వెళుతున్నారన్నారు. ఆయా గ్రామాలను పోలీసు క్యాంపులుగా మార్చారని దుయ్యబట్టారు. పూర్తిగా పోలీసు బందోబస్తు మధ్య కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని వారు ప్రశ్నించారు. సిఎం పర్యటించే గ్రామాల్లో 144వ సెక్షన్ పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం చెప్పిన తర్వాతే రావాలని హెచ్చరించారు. సిఎం రచ్చబండ కార్యక్రమం నేపథ్యంలో వరంగల్ ఎమ్మెల్యే వినయభాస్కర్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అయితే ఎమ్మెల్యే తప్పించుకొని వచ్చి కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
కాగా మంత్రి బస్వరాజు సారయ్య రచ్చబండను అడ్డుకోవడాన్ని ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఖచ్చితంగా ఇస్తుందని చెప్పారు. అయితే కొందరు రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రితో రచ్చబండలో తెలంగాణ తీర్మానం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమాన్ని ఎవరూ అడ్డుకోవద్దని సూచించారు. మహబూబాబాద్ ఘటన పునరావృతం కాదన్నారు. కాగా పలువురు తెలంగాణవాదులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications